‘ఒక మంచి వినోదం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మా సినిమా సక్సెస్‌తో అర్థమైంది. ఆయ్, లిటిల్ హార్ట్స్ తర్వాత అలాంటి హోల్సమ్ ఎంటర్టైనర్ అని అందరూ అంటున్నారు. తెలుగునేలపై అన్ని వైపుల నుంచీ మంచి టాక్ ఉంది. క్రిటిక్స్ సైతం ఈ సినిమాను అభినందనలు అందించారు. ప్రధాన తారాగణమంతా తమ నటనతో ఆకట్టుకోగా, సాంకేతికంగా అందరూ అద్భుతంగా పనిచేశారు’ అంటూ ఆనందం వెలిబుచ్చారు నిర్మాతల్లో ఒకరైన మధురా శ్రీధర్ రెడ్డి. ఆయన నిర్వి హరిప్రసాద్‌రెడ్డితో కలిసి నిర్మించిన వినోదాత్మక చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి సంజీవ్‌రెడ్డి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తూ చిత్రబృందం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఓ సోషల్ ఇష్యూకి వినోదాన్ని మిళితం చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తున్నదని, కొత్త కంటెంట్‌తో ఎక్కడా అసభ్యత లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంతా కొనియాడుతుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందని దర్శకుడు సంజీవ్‌రెడ్డి చెప్పారు.