Shraddha Kapoor | సినిమాల ఎంపికలో తాను హీరోల ఇమేజ్‌కు అంతగా ప్రాధాన్యతనివ్వనని, సవాలుతో కూడిన పాత్రలనే అంగీకరిస్తానని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్త్రీ-2’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్నది. ఇప్పటికే 250కోట్ల కలెక్షన్స్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సినిమా ఎంపికలో తన ప్రాధాన్యతల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది శ్రద్ధాకపూర్.
సుదీర్ఘ కెరీర్లో ఈ భామ ఇప్పటివరకు బాలీవుడ్ ఖాన్ల త్రయమైన సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్ చిత్రాల్లో నటించలేదు. ఇదే విషయమై శ్రద్ధాకపూర్ మాట్లాడుతూ ‘ఆ ముగ్గురు అగ్ర హీరోల చిత్రాల్లో చాలా ఆఫర్లొచ్చాయి. అయితే నా పాత్రపరంగా అంత గొప్పగా అనిపించలేదు.
ఏవో కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో కనిపించే క్యారెక్టర్స్‌ను నేను అస్సలు ఒప్పుకోను. ఎంత పెద్ద హీరో చిత్రమైనా కథాగమనంలో నా పాత్రకు ఇంపార్ట్సెన్స్ ఉండాలి. అప్పుడే అంగీకరిస్తాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన వద్దకు ఛాలెంజింగ్ రోల్స్ వస్తున్నాయని, భవిష్యత్తులో పెద్ద హీరోలతో గొప్ప కథా చిత్రాల్లో నటించాలనుందని శ్రద్ధాకపూర్ పేర్కొంది.