కథలో విషయం ఉంటే చాలు తారల ఇమేజ్‌తో సంబంధం లేకుండా సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని బాలీవుడ్ చిత్రం ‘స్త్రీ-2’ నిరూపిస్తున్నది. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ కేవలం 20 రోజుల్లోనే 515కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్ని పోషించారు. 2018లో వచ్చిన ‘స్త్రీ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్, కథలోని అనూహ్య మలుపులు, తలలేకుండా కేవలం మొండెంతో కనిపించే విలన్ సర్కతా పాత్ర హైలైట్‌గా నిలుస్తున్నది. ‘స్త్రీ-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని, దసరా వరకు లాంగ్న్ ఉంటుందని ఫిల్మ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.