STR 49 | తమిళ స్టార్ హీరో సిలంబరసన్ టీఆర్(శింబు) మళ్లీ వరుస ప్రాజెక్ట్‌లను ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న థగ్ లైఫ్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న శింబు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఒకే చేశాడు. శింబు తన తదుపరి చిత్రం ‘STR 49’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా శనివారం చెన్నైలో గ్రాండ్ లాంచింగ్‌తో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సంతానం కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ 2015లో వచ్చిన ‘వాలు’ చిత్రం తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
‘పార్కింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. సిలంబరసన్‌కు జోడీగా ‘డ్రాగన్’ ఫేమ్ కాయడు లోహర్ నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగనుందని సమాచారం. తమిళ చిత్రాల్లో కనిపించే చెన్నై కాకుండా, హైదరాబాద్, కేరళలోని అందమైన క్యాంపస్‌లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. కథలో సంతానం పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, సిలంబరసన్ స్వయంగా ఆయన పాత్ర ప్రాధాన్యతను పెంచేలా చూసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2025 రెండవ వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా, తాజాగా లాంచింగ్ కార్యక్రమం జరిగింది. సిలంబరసన్ నటిస్తున్న ఈ 49వ చిత్రంపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Here Is The #STR49 Pooja Exclusive Pics🤩💥✨ @iamsanthanam #SilambarasanTR #Santhanam Congratulations Whole Team🔥 pic.twitter.com/cECNEsJgn9
— world Cine insider (@worldInsiders_) May 3, 2025