Micheal Movie | ప్రముఖ పాప్ సంచలనం మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ (Micheal) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తున్న తరుణంలో, ఆమెరికా పత్రిక న్యూయార్క్ పోస్ట్(New York Post) ప్రచురించిన ఒక వివాదాస్పద కథనంపై మైఖేల్ జాక్సన్ మేనల్లుడు తాజ్ జాక్సన్ (Taj Jackson) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా మొదటి వీకెండ్లోనే 217 మిలియన్ డాలర్ల(రూ.2059 కోట్లు) భారీ వసూళ్లు రాబట్టడంతో, జాక్సన్ కుటుంబం ఈ విజయాన్ని ఆసరాగా చేసుకుని ‘థ్రిల్లర్’ టూర్లు, సీక్వెల్ సినిమాల ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందంటూ న్యూయార్క్ పత్రిక కథనాన్ని రాసుకొచ్చింది.
అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మైఖేల్ జాక్సన్ మేనల్లుడు తాజ్ జాక్సన్, న్యూయార్క్ పోస్ట్ మరియు రిపోర్టర్ స్టేసీ బ్రౌన్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేవలం క్లిక్ బైట్ కోసం నకిలీ సోర్సులను సృష్టించి తమ కుటుంబంపై అబద్ధాలు ప్రచారం చేయడం ఆపాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా గతంలో మైఖేల్ జాక్సన్ కోర్టు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో రిపోర్టర్ స్టేసీ బ్రౌన్ ప్రాసిక్యూషన్ బృందంతో కలిసి విందు చేశారని, అందుకే ఆయనకు ఎటువంటి విశ్వసనీయత లేదని తాజ్ ఆరోపించారు. తమ కుటుంబాన్ని నిరంతరం వేధిస్తూ తప్పుడు కథనాలు రాస్తున్న టాబ్లాయిడ్లను ప్రజలెవరూ నమ్మవద్దని, కేవలం లాభాల కోసమే జాక్సన్ ఫ్యామిలీ పాకులాడుతోందన్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Do I have to drag you again, @nypost. Leave my family alone with your lies and click bait articles. You and your fake sources. A “family source”.. blah blah blah. Stacy Brown, you have no credibility, never have. That’s why I’ve called you a weasel in the past. And just so you… https://t.co/OOJTACbSuB
— Taj Jackson (@tajjackson3) May 1, 2026