Gopi Chand | టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్లో మరోసారి జోరు పెంచిన ఆయన, కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘భరతవర్ష’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా దృశ్యాలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో గోపీచంద్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే సమయంలో, నూతన దర్శకుడు కుమార్ సాయి తో మరో చిత్రానికి కూడా ఆయన అంగీకరించారు. ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగం విదేశాల్లో జరగనుంది. సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక తాజాగా గోపీచంద్ తన జాబితాలో మరో యాక్షన్ కథను చేర్చాడు. ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ సంగీతం అందించనున్నారు. పలువురు ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం మే 3న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరగనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాత, గోపీచంద్ ఈ కొత్త యాక్షన్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. వరుస యాక్షన్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కాగా, గోపిచంద్ కి ఈ మధ్య కాలంలో మంచి హిట్స్ రాలేదు. ఒకప్పుడు మంచి హిట్స్ కొట్టిన గోపి ఎందుకో వెనకబడిపోయాడు. మళ్లీ మంచి హిట్ ఒక్కటి వస్తే తిరిగి పుంజుకోవడం గ్యారెంటీ అంటున్నారు ఆయన అభిమానులు.