Star Movie | కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ (Actor Kavin) గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఈ కుర్ర హీరో.. దాదా సినిమాతో తమిళంలో భారీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఓటీటీలో (ప్రైమ్)లో కూడా విడుదలై రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా ఈ నటుడు స్టార్ (Star Movie) అనే కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా (Yuvan Shanker raaja) సంగీతం అందించనున్నాడు. కాగా నేడు యువన్ శంకర్ రాజా పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ స్టార్ మూవీ నుంచి ఓ స్పెషల్ ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో కవిన్ హీరో అవ్వాలని.. నటుడిగా తనను తాను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి తపన పడుతున్నట్లు కనిపిస్తుండగా.. ఈ మూవీకి సంగీతమే ప్రధానం అని తెలుస్తుంది. ఈ సినిమాకు ప్యార్ ప్రేమ కాదల్ (Pyar Prema Kadhal) ఫేమ్ ఎలాన్ (Elan) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తమిళ ప్రోడక్షన్స్ రైస్ ఈస్ట్ ఎంటర్టైనమెంట్స్ (Rise East Entertainments), టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
என் கனவுகள் வீழாது!
Happy birthday Yuvan sir @thisisysr ♥️@elann_t @riseeastcre @SVCCofficial @Pentelasagar @BvsnP @Ezhil_DOP @PradeepERagav @Meevinn @sujith_karan @dancersatz @rajakrishnan_mr @muthukumaranvfx @VickyStunt_dir @venkystudios @vinoth_offl @proyuvraaj @vamsikaka… pic.twitter.com/y3d7kiFguT
— Kavin (@Kavin_m_0431) August 31, 2023
You are a #STAR ⭐
️#STARMOVIE Special Promo is Out ! #HAPPYBIRTHDAYYUVAN Sir🌟🎶▶️- https://t.co/JawXPUjiAu#KAVIN #YUVAN #ELAN@Kavin_m_0431 @elann_t @thisisysr @riseeastcre @SVCCofficial @Pentelasagar @BvsnP @Ezhil_DOP @PradeepERagav @Meevinn @sujith_karan @dancersatz pic.twitter.com/eXgj0x8uh8
— SVCC (@SVCCofficial) August 31, 2023