Stalin 4K | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం స్టాలిన్. చిరంజీవి సొంత బ్యానర్ అయిన అంజన ప్రోడక్షన్ బ్యానర్లో ఈ సినిమా విడుదల కాగా.. 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాను 19 ఏండ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మెగా అభిమానులను ఉద్దేశించి చిరు ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నాడు.
‘స్టాలిన్’ చిత్రం విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు కావోస్తుంది. ఇన్ని ఏండ్ల తర్వాత తిరిగి మళ్లీ నా పుట్టినరోజున ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాత నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. ఒక వీర జవాన్‌గా దేశ సరిహద్దుల వద్ద ఉన్న శత్రువులతో పోరాడడం కాదు. దేశం లోపల ఉన్నశత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని ఈ సమాజంలో అంతర్యుద్ధం చేయడానికి ఒక సామజిక సృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్రంలోని స్టాలిన్. ఈ సమాజాంలో తనవలన మేలు పొందిన ప్రజలు తనకు కృతజ్ఞతలు చెప్పడం కాకుండా అలాంటి మంచి పనే ముగ్గురికి చేసి.. ఆ ముగ్గురిని మరో ముగ్గురితో చేయమని చెప్పడం ఈ సినిమాలో చాలా బాగా చెప్పబడింది. ఈతరం యువకులకు బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిన చిత్రమిది. అలాగే ఈ సినిమాలో నటించిన నటులు ఖుష్బు, త్రిషలకి అలాగే ఇతర సాంకేతిక బృందంకి.. సంగీత దర్శకుడు మణిశర్మకి, దర్శకుడు మురుగదాస్‌కి నిర్మాత నా తమ్ముడు నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రం మిమ్మల్ని మళ్లీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను అంటూ చిరు చెప్పుకోచ్చాడు.
Straight from the HEART of the BOSS ❤️🔥#Stalin Reporting in Theatres on 22nd August 🌟@KChiruTweets @trishtrashers @NagaBabuOffl pic.twitter.com/vDRxTa9YfC
— Anjana Productions (@Anjana_Prod) August 16, 2025