CM Vijay | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ సంతకం చేసిన తొలి నిర్ణయాలను ఆయన స్వాగతించారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ నిర్వహణ మరియు ఆర్థిక అంశాలపై స్టాలిన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని సాకులు చెప్పకుండా, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో పాలన సాగించాలని ఆయన సూచించారు. తమ హయాంలో కరోనా కష్టకాలం, వరదలు మరియు కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఐదేళ్ల పాటు లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసిందన్న ఆరోపణలను స్టాలిన్ ఖండించారు. తమిళనాడు అప్పులు అనుమతించబడిన పరిమితుల్లోనే ఉన్నాయని, ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాము స్పష్టమైన వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. ఆ వివరాలన్నీ తెలిసే కదా ఎన్నికల్లో హామీలు ఇచ్చారని విజయ్ను ప్రశ్నించిన స్టాలిన్, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. సాధ్యమయ్యే హామీలనే ఇస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన విజయ్, ఇప్పుడు పరిపాలనలో అడుగుపెట్టారని.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఉన్న మెళకువలను ఆయన త్వరలోనే నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. తమిళనాడు అభివృద్ధి ప్రస్థానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆయన తన సందేశాన్ని ముగించారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராகப் பொறுப்பேற்றுள்ள தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு. @ActorVijay அவர்களுக்கு எனது மனப்பூர்வமான வாழ்த்துகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
பதவியேற்றதும் தாங்கள் கையெழுத்திட்டுள்ள அறிவிப்புகளையும் வரவேற்கிறேன்.
எடுத்த எடுப்பிலேயே அரசிடம் பணம் இல்லை…
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 10, 2026