RRR Movie | దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్(RRR). అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటించింది. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్’(RRR: Behind and Beyond) అంటూ ఈ డాక్యుమెంటరీ రాగా.. ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు జపాన్‌లో విడుదల కాబోతుంది. దీని ప్రచారంలో భాగంగా రాజమౌళి దంపతులతో పాటు కార్తికేయ జపాన్ వెళ్లారు.
ఈ చిత్రం మరియు డాక్యుమెంటరీ గురించిన విశేషాలను రాజమౌళి జపాన్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ లో విడుదలైనప్పుడు మంచి ఆదరణ పొందింది. 34 రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించి 300 మిలియన్ జపాన్ యెన్ క్లబ్ లో చేరింది. ఈ క్లబ్ లో అత్యంత వేగంగా చేరిన మొదటి భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది. ఈ డాక్యుమెంటరీని కూడా జపాన్ ప్రేక్షకులు ఆదరిస్తారని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు.
#RRR:ビハインドビヨンド
めちゃくちゃよかった…ずっと涙が止まらなくてRRRの素晴らしさを素晴らしさを改めて感じたドキュメンタリーでした😭
そして全然目が足りない!
ラージャマウリ監督とカールティケーヤさんの色んなお話が聞けて幸せ!!
ラマさんもお目にかかれて本ッ当に最高でした🥲❤️🔥 pic.twitter.com/soolePWiOu— 🍏林檎 (@grnaph) April 12, 2025