S.S RAjamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి – మహేశ్ బాబు మూవీ బాహుబలి కంటే ముందే స్టార్ట్ అవ్వాల్సిందని కానీ డేట్స్ కుదరక వాయిదా పడుతూ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై బహుబలి సినిమా విడుదల కాకముందే అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. ఈ వీడియోలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేశ్ బాబుతో ఎప్పుడు సినిమా చేస్తారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మేము ఇంతకుముందే ఒక సినిమాకు సంతకం చేశాం. కేఎల్ నారాయణ నిర్మాత. మహేశ్ హీరోగా ఈ సినిమా రాబోతుందంటూ 2015కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాహుబలి అనంతరం అయిన ఈ ప్రాజెక్ట్ మొదలుపెడదాం అనుకున్న రాజమౌళికి మహేశ్ డేట్స్ దొరకకపోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమాను తీశాడు. కాగా జక్కన్న మహేశ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాట్లాడిని వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
SSR about a movie with Superstar Mahesh Babu. (2015 Interview) pic.twitter.com/urhyAzuV88
— 🅱️ 🇮🇳 (@BharathTweetz) October 19, 2024