S.S Rajamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీ జనవరి 2వ తేదీన ప్రారంభించనున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. పూజ కార్యక్రమాలను గురువారం నిర్వహించి త్వరలోనే సెట్స్ మీదకి తీసుకువెళ్లబోతున్నట్లు సమాచారం. యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది.