SSMB 29 | గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29). మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
జక్కన్న ఇంట్లో ఎంఎం కీరవాణి మూవీ ఆడియో ఆల్బమ్ కంపోజింగ్ మొదలుపెట్టాడట. ప్రస్తుతం రాజమౌళి ఫామ్‌హౌస్‌లో ఎస్ఎస్ఎంబీ 29 ఆడియో ఆల్బమ్ పనులు కొనసాగుతున్నాయని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు మ్యూజిక్ ఆల్బమ్ మేకింగ్‌లో జక్కన్న కూడా భాగం కాబోతున్నాడని టాక్.
మరోవైపు సుమారు 100 మంది స్టంట్మెన్లు భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రిహార్సల్స్ సెషన్లో పాల్గొంటున్నారని ఇన్సైడ్ టాక్. ఈ థ్రిల్లింగ్ సీక్వెన్స్‌ను టాంజానియాలో సాగే మేజర్ షెడ్యూల్లో షూట్ చేసేందుకు జక్కన్న టీం రెడీగా ఉన్నట్టు ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మొత్తానికి జక్కన్న టీం క్రేజీ అప్డేట్తో మహేశ్ బాబు ఫాలోవర్లు, అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మహేశ్‌బాబు ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ మార్చుకుని.. లాంగ్ హెయిర్, గడ్డం, పోనీ టెయిల్ లుక్‌లోకి మారిపోయి అందరిలో జోష్ నింపుతున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోండగా.. జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.