SSMB 29 | టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న రాజమౌళి – మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రోటర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మాసివ్ ప్రాజెక్ట్ రూపొందుతోంది. అయితే ఫైనల్ టైటిల్‌గా ‘వారణాసి’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి దర్శకుడు రాజమౌళి శుక్రవారం పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన, అత్యాధునిక వీల్‌చైర్‌లో కూర్చుని ఉంటారు. ఆ వీల్‌చైర్‌కి ఉన్న శక్తివంతమైన ఆర్మ్‌లు శత్రువులను సులభంగా మట్టుపెట్టగల శక్తి కలిగినట్లు పోస్టర్ సూచిస్తోంది.
వెనుక సెక్యూరిటీ గార్డులు పరుగులు తీస్తూ, భారీ పిల్లర్స్ నేపథ్యంలో సెట్ చేయడం వల్ల ఇది ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్‌గా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ విడుదల కాగానే సోషల్ మీడియాలో ఇది ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. కొందరు ఇది అద్భుతమని ప్రశంసిస్తుండగా, మరికొందరు ‘క్రిష్ 3’, ‘24’ మూవీలను కాపీ కొట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. సూర్య ‘24’ మూవీలో విలన్ ఇలాంటి వీల్‌చైర్‌లో కనిపించారని, బాలీవుడ్లో ‘క్రిష్ 3’లో వివేక్ ఒబేరాయ్ లుక్ కూడా ఇలాగే ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు మాత్రం ఈ ట్రోల్స్‌కి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఇలాంటివి చెబుతూ సమయం వృథా చేసుకోకండి, గ్లోబల్ సినిమా కోసం రెడీ అవ్వండి అంటూ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ పోస్టర్‌తోనే సినిమా పై అంచనాలు రెట్టింపయ్యాయి.
ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో మూవీ టైటిల్, టీజర్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. రాజమౌళి తన కొత్త సినిమా ద్వారా ఇండియన్ సినిమాకి గ్లోబల్ స్థాయి విజన్ చూపించబోతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. ఫ్యాన్స్ మాత్రం “జక్కన్న మళ్లీ మాయ చేయబోతున్నాడు” అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.