SSMB 29 |టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న పాన్–వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే ఈ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల్లో హైప్ పెంచేశారు. ఈ చిత్రంలో మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రాజమౌళి తాజాగా పోస్ట్ చేశారు.
ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో .. ప్రస్తుతం సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు #GlobeTrotter ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 15న జరిగే ఈవెంట్లో ఎన్నడూ చూడని అనుభూతి మీ అందరికీ లభిస్తుంది. దానికంటే ముందు ఈ వారంలో పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ కానుంది. మీరు ఈ వారం మరింత ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను,” అని రాజమౌళి తెలిపారు. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ఇప్పటికే దాదాపు సంవత్సరం నుంచి ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు.
స్క్రిప్ట్ డెవలప్మెంట్, క్యాస్టింగ్, లొకేషన్ ఫైనలైజేషన్, టెక్నికల్ టీమ్ ఎంపికలో రాజమౌళి అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. సినిమా కాన్సెప్ట్ ప్రకారం ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్, అంటే భారతీయ సినిమా చరిత్రలోనే కొత్త పంథాను తీసుకురావాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. SSMB29 సినిమాను ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో, భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించే ప్రయత్నంలో రాజమౌళి టీమ్ ఉంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని రగ్గడ్ యాక్షన్ లుక్‌లో కనిపించనున్నారని, ఆయన పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు. ఇప్పుడు పృథ్వీరాజ్ లుక్ రానుండటంతో అభిమానుల్లో హుషారు మరింత పెరిగింది.