SSMB 29 | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్సక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ SSMB29. ఈ చిత్రంపై అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మూవీకి సంబంధించిన అధికారిక అప్డేట్లు తక్కువగానే వచ్చినప్పటికీ, అప్పుడప్పుడు లీకులు, రూమర్స్ రూపంలో వస్తున్న సమాచారం మాత్రం అంచనాలను పెంచేస్తుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం, ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలని చిత్రీకరించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో, పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క సీన్ పర్ఫెక్షన్తో ఉండాలనే లక్ష్యంతో జక్కన్న పని చేస్తున్నారట. ఇక హీరో మహేష్ బాబు మాత్రం తన కొత్త లుక్ కోసం గట్టిగా వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలోకీలక డ్యాన్స్ సీక్వెన్స్ ఉండనుందని, దానికోసం మహేష్ ఇప్పటికే రిహార్సల్స్ ప్రారంభించినట్టు టాక్. రాజమౌళి సినిమాలో ఇది మహేష్‌కు ఛాలెంజింగ్ ఎలిమెంట్‌గా మారనుందని చెబుతున్నారు. SSMB29 కోసం దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్లు, విదేశీ నటులు కూడా భాగం కానున్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ జరుగనుంది.
మొదట కెన్యాలో షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికీ, అక్కడి భద్రతా సమస్యల కారణంగా ఆ ప్లాన్ రద్దు చేయాల్సి వచ్చిందని సమాచారం. ఇక మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అధికారికంగా ఖరారు కాకపోయినా, ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతుంది. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న SSMB29 సినిమాపై ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇది సాధారణ తెలుగు సినిమా కాదు, హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంటుందని ముచ్చటించుకుంటున్నారు.