SSMB 29 | దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి , సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో తెరకెక్కుతున్న SSMB29పై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027లో విడుదల కానున్న ఈ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ప్రతీ అంశం గోప్యంగానే ఉంటుంది.గత కొద్ది రోజులుగా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసారి మహేశ్ బాబు పుట్టినరోజు (ఆగస్ట్ 9) సందర్భంగా SSMB29 చిత్రానికి సంబంధించి ఎలాంటి టీజర్, మోషన్ పోస్టర్ విడుదల చేయకపోవడం ఆయన ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేసింది. సాధారణంగా హీరోల బర్త్‌డే సందర్భంగా చిన్న అప్డేట్ అయినా ఇచ్చే ట్రెండ్‌ను రాజమౌళి ఈసారి పక్కన పెట్టారు. ట్రెడిషనల్ ప్రమోషన్ పద్ధతులకు రాజమౌళి గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది.
RRR ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించిన తర్వాత, రాజమౌళి ఫోకస్ అంతర్జాతీయ మార్కెట్‌పైనే ఉంది. అదే దిశగా SSMB29 కూడా ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతుంది. ఇందులో మహేశ్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి టెస్ట్ షూట్లు, కాస్ట్యూమ్ & మేకప్ ట్రయల్స్, స్టంట్ కొరియోగ్రఫీ, ప్రీ విజువలైజేషన్ వర్క్ నడుస్తున్నాయి. ఆస్కార్ విజేతలు, ఇంటర్నేషనల్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలసి సినిమా పని వేగంగా సాగుతోంది. రాజమౌళి ఎప్పటిలానే స్క్రిప్ట్, టెక్నికల్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ, అత్యున్నత స్థాయి ప్రమాణాలతో సినిమా రూపొందిస్తున్నారు.
SSMB29 ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో అధికారికంగా తెలియకపోయినా, ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహం మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. అయితే అభిమానుల ఎదురుచూపులకు ఇంకొన్ని నెలలు వేచి ఉండాల్సిన అవకాశం ఉంది.వచ్చే ఏడాది 2026 ఆగస్టులో ఓ సాలిడ్ ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ లేదా టీజర్ రిలీజ్ చేసి సినిమాని హైప్ పెంచాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇప్పుడు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరికొందరు రాజమౌళి సినిమా అంటే వెయిట్ చేయాల్సిందేనని సర్ది చెప్పుకుంటున్నారు.