SS Thaman – Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం డాకు మహరాజ్. బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత హ్యట్రిక్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ సక్సెస్ మీట్లో తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ సంగీత దర్శకుడు థమన్ ఎమోషనల్ అయ్యాడు. విజయం అనేది ఎంత డబ్బు పెట్టిన దొరకదు. అది వచ్చినప్పుడు ఇచ్చే ఎనర్జీ వేరు. మనం లైఫ్‌లో చాలా ముందుకు పోవడానికి సక్సెస్ చాలా ఉపయోగపడుతుంది. సక్సెస్ లేకపోతే నేను ఫిలిం నగర్‌కి కూడా వెళ్లేవాడిని కాదు. అయితే ఒక సక్సెస్ వచ్చిందని చెప్పడానికి కూడా ఇప్పుడు నిర్మాతలకు చెప్పబుద్ది కావడం లేదు. అలా చేబితే అతడిపై నెగిటివ్‌గా ట్రోల్ చేయడం.. నెగిటివ్‌గా ట్రెండ్ చేయడం జరుగుతుంది. మీరు చేసే నెగిటివ్ ట్రోల్స్ చేయడం వలన నిర్మాతల జీవితాలు ఎఫెక్ట్ పడుతున్నాయి.
నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతుంది. ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిన తెలుగులో ఒక సినిమా చేయాలి అని అడుగుతున్నారు. మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏం బ్రతుకు బ్రతుకుతున్నాం అనేది అర్థం కావాట్లేదు. విపరీతమైన ట్రోల్స్ వలన బాధగా ఉంది. ఒక సక్సెస్‌ని నిజంగా చెప్పుకోలేకపోతున్నాం. ఇది ఎంత దురదృష్టకరం. మీరు పర్సనల్‌గా కొట్టుకొండి కానీ సినిమాను చంపేయకండి. నేను అదే వేడుకుంటున్నాను అంటూ థమన్ చెప్పుకోచ్చాడు.
Don’t kill a film by doing useless trolls and negative trends, #Thaman fires on a few jobless fans who live & breathe negativity all the time. pic.twitter.com/H21Wwrc6Te
— Aakashavaani (@TheAakashavaani) January 17, 2025