Thaman | ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అగ్ర సంగీత దర్శకులలో ఎస్.ఎస్ థమన్ ఒకరు. వైశాలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ‘కిక్’ సినిమాతో ఏకంగా టాలీవుడ్లో సెటిల్ అయిపోయాడు. రీసెంట్గా డాకు మహరాజ్ సినిమాతో సూపర్ హిట్టు అందుకున్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న థమన్ తన కెరీర్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
నా సినీ కెరీర్లో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని థమన్ తెలిపారు. లైఫ్‌లో ఏదొక టైంలో కొందరిని బాగా నమ్ముతాం. కానీ మోసం చేస్తే తట్టుకోలేం. నా జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి. నా లైఫ్‌లో చాలామందిని నమ్మాను.. కానీ వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు. నాతో మంచిగా నటించి.. నా వెనుక నుంచి గొయ్యిలు తీయడమే కాకుండా.. నా గురించి చెత్తగా మాట్లాడేవారు. ఇలాంటి ఘటనలు నా జీవితంలో చాలా ఉన్నాయి. అన్నింటిని తట్టుకుని మీ ముందు నిలబడ్డాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాకు ఒత్తిడి అనిపిస్తే క్రికెట్ ఆడి బెటర్ అవుతాను. చిన్నప్పటి నుంచి నాకో స్పెషల్ టీం ఉండాలి అనుకునేవాడిని సెలబ్రీటి క్రికెట్ లీగ్ వలన ఆ ఆశ కూడా తీరిపోయింది. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ఓజీ చేస్తున్నా. ఇదోక ఆటామ్ బాంబ్ లాంటి మూవీ.. సినిమా చూసి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారంటూ థమన్ చెప్పుకోచ్చాడు.