‘కథలోని భావోద్వేగాలను బట్టే సంగీతం తాలూకు నాణ్యత ఆధారపడి ఉంటుంది. సినిమాలో ఎమోషన్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేసినా వృథానే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాల ఎంపికలో మంచి కథలకే ప్రాధాన్యతనిస్తున్నా’ అన్నారు అగ్ర సంగీత దర్శకుడు తమన్. ప్రస్తుతం ఆయన ఓజీ, రాజాసాబ్, గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి భారీ చిత్రాలకు మ్యూజిక్నందిస్తున్నారు.
నేడు తమన్ జన్మదినం. ఈ సందర్భంగా శనివారం ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..