Bahubali The Epic Promotions | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన సినిమాల విషయంలో ఎంత కఠినంగా, అంకితభావంతో ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే, వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోనూ ఆయన తీసుకుంటున్న క్రమశిక్షణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం రేపు రీ రిలీజ్ కాబోతుండగా.. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇందులో భాగంగా ప్రభాస్‌తో ఒక ఇంటర్వ్యూలో పాల్గోనగా.. ప్రభాస్‌తో మాట్లాడుతూ.. డార్లింగ్ నేను షుగర్ (తీపి పదార్థాలు/పంచదార) మానేసి 47 రోజులవుతుందని తెలిపాడు. దీంతో షాక్ తిన్న ప్రభాస్ అలా ఏలా డార్లింగ్ అని జక్కన్నని అడుగుతాడు. దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. చాలా రోజులు నుంచి అనుకుంటున్నా షుగర్‌కి దూరంగా ఉందామని.. ఎందుకో తెలియదు షుగర్‌కి చాలా అడిక్ట్ అయ్యాను. దీంతో నేను డిసైడ్ అయ్యి షుగర్‌ని దూరం పెట్టాను. ఇప్పటికీ 47 రోజులు అవుతుంది. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ చేయవచ్చు అనేది అంటూ రాజమౌళి చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రాజమౌళి: డార్లింగ్.. ఈ రోజు నా 47th డే నో షుగర్.
ప్రభాస్: మీకున్నది ఒకటే ఒక్కటి, మా లిస్ట్ వేస్తే పేజీలు ఉంటాయి. #BaahubaliTheEpic pic.twitter.com/lhoOZbVB1f
— idlebrain.com (@idlebraindotcom) October 30, 2025