SS Rajamouli | దర్శకధీరుడి క్లారిటీ.. అవును మహేశ్‌తో సినిమా చేస్తున్న: రాజమౌళి
మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ అనుకున్నప్పటినుంచీ.. ఈ సినిమాపై ఏ చిన్న విషయం బయటకొచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతున్నది. కొందరైతే.. ఉన్నవీ లేనివీ కూడా కల్పించుకొని మరీ ఈ సినిమాపై వార్తలు రాసేస్తున్నారు.
SS Rajamouli | మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ అనుకున్నప్పటినుంచీ.. ఈ సినిమాపై ఏ చిన్న విషయం బయటకొచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతున్నది. కొందరైతే.. ఉన్నవీ లేనివీ కూడా కల్పించుకొని మరీ ఈ సినిమాపై వార్తలు రాసేస్తున్నారు. ఈ సినిమాకు ‘మహారాజ్’ అనే టైటిల్ ఖరారు చేశారనే వార్త రీసెంట్గా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. ఇలాంటి వార్తలన్నింటికీ చెక్ పెట్టేశారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.
తాజాగా ఆయన బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ సినిమా గురించి అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘మహేశ్‌తో సినిమా చేస్తున్నా. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. పేరైతే ఇంకా ఫైనల్ కాలేదు.’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను బాగా వైరల్ అవుతున్నది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్ హంట్ మూవీగా దర్శకధీరుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడనేది విశ్వసనీయ సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

