SS Rajamouli | రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2: ద రివెంజ్’ చిత్రంపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమా చూసిన జక్కన్న ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
ఈ చిత్రం మొదటి భాగం కంటే స్కేల్ మరియు ఎమోషన్ పరంగా అద్భుతంగా ఉందని, తనకు ‘ధురంధర్ 1’ అంటే చాలా ఇష్టమని కానీ సీక్వెల్ దానిని మించిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా 4 గంటల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులను సీటు నుంచి కదలకుండా చేయడంలో దర్శకుడు ఆదిత్య ధార్ విజయం సాధించారని, ఇది ఒక గొప్ప సాహసమని రాజమౌళి కొనియాడారు. రణవీర్ సింగ్ నటనను ప్రస్తావిస్తూ, షెడ్ లో చెల్లెలితో వచ్చే సన్నివేశం ఒక ‘మాస్టర్‌క్లాస్ ఇన్ యాక్టింగ్’ అని, హమ్జా మరియు జస్కీరత్ పాత్రల్లో ఆయన మెస్మరైజ్ చేశారని అభినందించారు. అలాగే ఆర్. మాధవన్ దేశం యొక్క నిస్సహాయతను తన నటనతో అద్భుతంగా పండించారని రాజమౌళి ప్రశంసించారు.
సినిమాలోని రైటింగ్, మ్యూజిక్, వరల్డ్ డిజైన్ వంటి సాంకేతిక అంశాలు కూడా అద్భుతంగా కుదిరాయని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ భారీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కూడా సునామీ సృష్టిస్తోంది, కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాస్తోంది.
I loved Dhurandhar-1, but The Revenge surpassed the original in both scale and soul.
The writing, casting, technical execution, music, world design and direction are flawless…. But it’s the emotional stakes that really ground it.The writing manages to weave plot twists that…
— rajamouli ss (@ssrajamouli) March 21, 2026