Kuberaa | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర చిత్రం నేడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్గా ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
The master @ssrajamouli garu graces the grand #KuberaaPreReleaseEvent today! 🔥
📍JRC Convention, 6pm Onwards #Kuberaa in cinemas June 20, 2025.#Kuberaa #KuberaaTrailer #SekharKammulasKuberaa #KuberaaOn20thJune
KING @iamnagarjuna @dhanushkraja@iamRashmika @jimSarbh… pic.twitter.com/HkMorWMMhO— Suresh Kondeti (@santoshamsuresh) June 15, 2025