SSMB 29 | ‘బాహుబలి 2’ తీసి దేశంలోని ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఓ టార్గెట్‌ని ఇచ్చేశారు రాజమౌళి. ప్రస్తుతం మేకర్స్ అందరి లక్ష్యం ఒక్కటే.. ‘బాహుబలి 2’. చిత్రమేంటంటే.. ఆ తర్వాత రాజమౌళి కూడా ‘ఆర్ఆర్ఆర్’ తీశారు. కానీ ‘బాహుబలి 2’ని చేరుకోలేకపోయారు. తన రికార్డును తానే అందుకోలేకపోయారన్నమాట. త్వరలో చేయనున్న మహేశ్‌బాబు సినిమాతోనైనా తన రికార్డును బ్రేక్ చేయాలనే కసితో ముందుకెళ్తున్నారు రాజమౌళి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ రచనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నామని ఇటీవల చిత్ర కథారచయిత విజేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో మొదలవుతుందట. జనవరి నుంచి వర్క్ షాపులు నిర్వహిస్తారట. ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించనున్నట్టు తెలుస్తున్నది. మూడు భాగాలుగా రూపొందనున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మించనున్న విషయం తెలిసిందే.