చెన్నై సొగసరి శృతిహాసన్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిస్తుంటుంది. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ అమ్మడు అభిమానులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొంది. ‘మీ వయసెంతో తెలుసుకోవచ్చా’ అని ఓ అభిమాని ప్రశ్నించినప్పుడు ‘ఇది చాలా సులభమైన ప్రశ్న.. గూగుల్ చేస్తే తెలిసిపోతుంద’ని చమత్కరించింది. తన పెళ్లి గురించి ఎవరూ ఆరా తీయొద్దని, అలాంటి విషయాలు అడిగితే తాను వాకౌట్ చేస్తానని సున్నితంగా హెచ్చరించింది. సినీ సెలబ్రిటీ అనే గర్వం తనకు ఎప్పుడూ లేదని, ఇప్పటికీ స్వయంగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకుల్ని తెచ్చుకుంటానని పేర్కొంది. ఆహారంలో తనకు దక్షిణాది పచ్చళ్లు ఎంతో ప్రియమైనవని చెప్పింది. అబద్ధాలు చెప్పేవాళ్లను తాను ఆసహ్యించుకుంటానని, అలాగే సాటి స్త్రీకి ఏ విషయంలోనూ మద్దతుగా రాని స్త్రీలను చూస్తే కోపంగా ఉంటుందని చెప్పింది. ఇతరుల కోసం మన అభిప్రాయాల్ని మార్చుకోవద్దని..మంచి కోసం..నమ్మిన విలువల కోసం చివరిదాకా నిలబడాలని అభిమానులను కోరింది.