Salaar | టాలీవుడ్‌తోపాటు వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ చాలా ఆసక్తిగాఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). పాన్ ఇండియా కమ్ గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ భామ తాజాగా సలార్ అప్డేట్ అందించింది. సలార్‌లో తన పాత్రకు డబ్బింగ్ మొదలు పెట్టింది. సలార్ పాత్రకు శృతిహాసన్ డబ్బింగ్ చెప్పుకుంటున్న స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
సలార్ రెండు పార్టులుగా వస్తుండగా.. ఇప్పటికే విడుదల చేసిన సలార్ Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రాబోతుండగా.. టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో రాబోతున్న సలార్‌లో ఇంటర్నేషనల్ యాక్టర్ ఇందులో నటిస్తున్నాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సలార్ పార్ట్-1ను 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. విజయ్ కిరగందూర్ సలార్ ను తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్టు 1 విడుదల తర్వాత సలార్ పార్ట్-2 ఎప్పుడు రాబోతుందనే దానిపై క్లారిటీ రానుంది.
సలార్ టీజర్..