Sonam Bajwa | షారుక్‌ఖాన్ కుమార్తె సుహానాఖాన్ లీడ్‌రోల్ చేస్తున్న చిత్రం ‘కింగ్’. ఇందులో షారుఖ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమాలో షారుఖ్ భార్యగా దీపికా పదుకోన్ కనిపించనున్నదనీ, ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నా, కీలకమైన పాత్ర అనీ.. ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. అయితే.. ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. అసలు ‘కింగ్’లో ఆమెను తీసుకోవాలనే ఆలోచనే తమకు లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆదిత్య చోప్రా త్వరలో ‘పఠాన్ 2’ నిర్మించనున్నారని, ఆ సినిమాలో అందరం షారుఖ్, దీపికా జోడీని చూడొచ్చని సిద్ధార్థ్ అన్నారు.
ఇంకా ఆయన చెబుతూ.. ‘కింగ్’లో పంజాబీ స్టార్ హీరోయిన్ సోనమ్ బజ్వా కీలక పాత్ర పోషించనున్నది. ప్రస్తుతం ఆమె హౌస్‌ఫుల్ 5, బాఘీ4 చిత్రాలతో బీజీగా ఉన్నది. ‘కింగ్’ ఆమె నటిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్. ఇందులో ఆమె పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. దాని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఈ ఏడాది ఇండియాలో ఒక షెడ్యూల్ చేస్తాం. ఇందులో అభిషేక్ బచ్చన్ కూడా ఓ ప్రధాన భూమిక పోషిస్తారు.’ అని సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు.