హ్యాట్రిక్‌కు సిద్ధం

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో రూపొందిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్నది. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదలచేశారు. కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జ్, కాళీమాత విగ్రహాలతో కూడిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ అనుబంధాలు, వినోదం, ప్రేమ అంశాల కలబోతగా సాగే చిత్రమిది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరంగా సాగుతుంది. భూపతిరాజా వినూత్నమైన పాయింట్‌తో కథను అందించారు. త్వరలో పూర్తి వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రీకరణతో గోపీచంద్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శ్రీవాస్ చిత్రం మొదలుకానుంది. ఈ చిత్రానికి కథ: భూపతిరాజా, సహనిర్మాత: వివేక్ కూచిభోట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

