శ్రీరామ్ నిమ్మల, సాయికీర్తన జంటగా నటిస్తున్న ‘సర్కార్ బాయి’ చిత్రం శుక్రవారం సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో ప్రారంభమైంది. లారా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దాస్య నాయక్ క్లాప్‌నివ్వగా, నిర్మాత కెమెరా స్విఛాన్ చేశారు.
తెలంగాణ సామాజిక నేపథ్య కథాంశమిదని, 1985లో జరిగిన నీటి గొడవలు, కుల వివక్షత వంటి అంశాల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి తెలిపారు. బాహుబలి ప్రభాకర్, నాగమహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కె.శివా, దర్శకత్వం: లారా.