పబ్బుల్లో, నైట్ పార్టీల్లో ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపే సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. కానీ మంగళూరు భామ శ్రీనిధి శెట్టి అలాంటి వాటికి పూర్తి వ్యతిరేకం. క్లబ్‌లు, పబ్‌ల కన్నా, దేవాలయాల సందర్శనలోనే ఎక్కువ ఆనందం ఉంటుందని, ఖాళీ టైమ్‌లో ఈషా ఫౌండేషన్‌కి వెళ్లి మెడిటేషన్ చేయడంలో ఉన్నంత ఆనందం మరెక్కడా దొరకదని శ్రీనిధి అంటున్నది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులు క్రమశిక్షణతో నన్ను పెంచారు. బాగా చదివించారు. యాక్సెంచర్ వంటి పెద్ద కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నన్ను మోడలింగ్ సినిమాలవైపు తీసుకొచ్చింది. నేను ఈ రోజు ఎంతటి స్టార్‌ని అయినా కావచ్చు. కానీ మూలాలను మాత్రం మరిచిపోను. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారాన్ని వదులు కోను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి.