తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram), అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) డైరెక్షన్లో చేస్తున్న సినిమా ‘కోబ్రా’. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ కేజీఎఫ్ ప్రాంఛైజీతో సూపర్ క్రేజ్సంపాదించుకుంది. కాగా ఈ ప్రాజెక్టు కోసం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
శ్రీనిధికి కోలీవుడ్ డెబ్యూ సినిమా ఇదే. తమిళంలో చేస్తున్న మొదటి సినిమాకే ఈ భామ రూ.6-7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంటే దాదాపు కేజీఎఫ్ రెమ్యునరేషన్ కంటే డబుల్ అన్నమాట. ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మృణాళినీ రవి, మియా జార్జ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. విక్రమ్ మరోవైపు మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ లో కూడా నటిస్తున్నాడు.