Srinidhi Shetty | బాలీవుడ్లో నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ఇతిహాస చిత్రం రామాయణ. దాదాపు రూ.4వేలకోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ మూవీ విషయంలో తనపై వచ్చిన రూమర్స్‌పై కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పందించింది. ఈ మూవీలో సీతపాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చానని.. హీరోయిన్గా మాత్ర ఎంపిక కాలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆ మూవీ కోసం తనకు బాలీవుడ్ నుంచి అవకాశం రావడమే గొప్ప విషయమని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో కన్నడ సోయగం ‘తెలుసు కదా’ మూవీలో నటిస్తున్నది. శ్రీనిధికి ఇది తెలుగులో రెండో చిత్రం. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డతో జతకడుతున్నది. ఈ మూవీలో మరో హీరియన్గా రాశీఖన్న నటిస్తుంది. రొమాంటిక్ డ్రామా మూవీకి నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.
ఈ మూవీ అక్టోబర్‌లో విడుదల కానున్నది. ఈ మూవీలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాల్లో యష్‌కు జోడీగా నటించిన విషయం తెలిసిందే. అయితే, రామాయణ మూవీలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. రావణుడిగా యష్ కనిపించనున్నాడు. యష్‌తో నటించి మళ్లీ రావణుడు, సీతగా కనిపిస్తే అభిమానులు జీర్ణించుకోలేదని.. దాంతో శ్రీనిధి శెట్టి సీత పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంలో కన్నడ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. రామాయణ మూవీలో సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా మూవీ రిలీజ్ కానుండగా.. తొలి పార్ట్ 2026 దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి విడుదల కానున్నది.
ఇంకా శ్రీనిధి మాట్లాడుతూ తల్లిదండ్రులకు ముగ్గురం ఆడపిల్లలమేనని.. తాను పదోతరగతిలో ఉండగా తల్లి చనిపోయినట్లు తెలిపింది. తండ్రి ఎన్నో కష్టాలను భరిస్తూ ముగ్గురిని పెంచారని.. ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలంటే ఎంతో ఇష్టమని.. అదే నన్ను తనను ఈ సినీరంగంలోకి ఫీల్డ్ కి వచ్చేలా చేసిందని చెప్పింది. కేజీఎఫ్ తర్వాత తాను ఎక్కడికి వెళ్లినా ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేసింది. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా.. నచ్చినవి మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. ఎంత క్రేజ్ వచ్చినా సింపుల్‌గా ఉండడమే ఇష్టమని.. అవసరమైతే క్యాబ్‌లో వెళ్తానని పేర్కొంది. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్‌కు సైతం వెళ్తుంటానని.. రోడ్డుపక్కన పానీపూరీ కూడా తినేసి వస్తుంటానని చెప్పింది. అక్కడ ఎవరైనా గుర్తు పట్టేలోగా బయటకు వెళ్లిపోతానని.. చెప్పింది.