శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రధారులుగా, బాల సతీశ్ దర్శకత్వంలో కనకమేడల ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని దర్శకుడు శైలోష్ కొలను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. హీరో శ్రీనాథ్ మాగంటి వైట్ అండ్ వైట్‌లో బ్లాక్ షేడ్స్‌తో.. కింగ్ ఛైర్స్‌లో కూర్చుని ఇంటెన్స్‌గా చూస్తూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ఇంకా గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజేష్, మురళీధర్‌గౌడ్, రాజ్‌కుమార్ కసిరెడ్డిలను కూడా ఈ పోస్టర్లో చూడొచ్చు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: అమ్మ ముత్తు, సంగీతం: సురేశ్ బొబ్బిలి.