‘ధమాకా’ విజయంతో శ్రీలీల మంచి జోరుమీదుంది.. ఆమె తాజాగా హీరో రామ్, బోయపాటి శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్లో శ్రీలీల గురువారం నుంచి పాల్గొంటున్నది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్లో హీరో రామ్, శ్రీలీలలకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఎడిటర్: తమ్మిరాజు, సినిమాటొగ్రఫీ: సంతోష్ డిటాకే, సమర్పణ: పవన్‌కుమార్.