శ్రీకాంత్, హ్రితిక జంటగా నటించిన చిత్రం ‘లాక్డౌన్. సిరాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. డిసెంబర్ తొలివారంలో విడుదలకానుంది. టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కలబోసిన సినిమా ఇది. లాక్డౌన్ సమయంలో ఓ జంటకు ఎదురైన పరిణామాలేమిటన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. థియేటర్స్‌తో పాటు ఓటీటీలోనూ ఒకేసారి విడుదలచేయబోతున్నట్లు దర్శకనిర్మాత తెలిపారు.