గత ఏడాది ‘క’ చిత్రంతో మంచి హిట్ కొట్టారు యువ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన ‘కె-ర్యాంప్’ ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు మున్సబుగారి వీధి’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని సమాచారం.
శ్రీకాంత్ అడ్డాల శైలిలో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇదని, కిరణ్ అబ్బవరం పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని అంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ‘పెదకాపు’ ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ కథతో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.