మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఇంతకముందు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని నిర్మించింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ”శ్రీదేవి శోభన్ బాబు” అనే టైటిల్ తో ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ని నిర్మిస్తున్నారు.
కొద్ది సేపటి క్రితం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఇందులో ‘ఏక్ మినీ కథ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘జాను’ ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో సంతోష్ – గౌరీ ఒకరినొకరు ప్రేమగా దగ్గరకు తీసుకొని ఉన్నారు. గౌరీ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఉండగా.. సంతోష్ మాత్రం ఫార్మర్ షర్ట్ లో రఫ్ గడ్డంతో మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపిస్తున్నాడు. సుస్మిత ఈ సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.