RS Praveen kumar | సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్‌ను డైవర్ట్ చేయడంలో సిద్ధహస్తుడు. మీకు ఎన్ని ఉదాహరణలు కావాలంటే అన్ని చెప్తానని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, మేడిగడ్డలో పిల్లర్ల కూల్చివేత అవేనని.. మేడిగడ్డ పిల్లర్ నంబర్ 20,21లు కూలిపోలేదు. వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరం. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధనేరమే. దాన్ని ఎందుకోసం రిపేర్ చేయడం లేదు మరి.. ఇసుక కోసం.. ఆంధ్రా ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చాలే, పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ కాకూడదు.
అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూగా పోలవరం దాకా పోతే అక్కడ నీటిని తీసుకెళ్లి బనక చర్లకు చేరాలే. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకున్నారు. ఆ కుట్రలో భాగమే ఆదిత్యానాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్పిపల్ సెక్రటరీగా పనిచేసిన ఒక అధికారిని తీసుకొచ్చి.. సూచనలన్నీ ఆయనుకు ఇస్తే.. ఆయన ఇవన్నీ రేవంత్ రెడ్డికి చెప్పి ఇవన్నీ కూడా చేయిస్తుండని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
వెనిజువెలా నికోలస్ మధురోను డొనాల్డ్ ట్రంప్ తీసుకెళ్లి ఆయనను అరెస్ట్ చేసి అమెరికాలో పెట్టుకొని.. వెనిజువెలా ఆయిల్ మీద అమెరికా ఎట్లయితే మొత్తం కూడా ఏక ఛత్రాధిపత్యం చేసి ప్రపంచమార్కెట్లో ఒక స్వతంత్ర దేశానికి చెందిన ఆయిల్‌ను ఒక ప్రాక్సీని పెట్టి ఏవిధంగా ప్రపంచమార్కెట్లో అమ్ముకుంటున్నదో.. ఆవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని సీఎంగా పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నడన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలని హితవు పలికారు.
రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాల్లో సిద్దహస్తుడు.
మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదు.. వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారు.
ఆ ప్రాజెక్టును ఎందుకు రిపేర్ చేయడం లేదు మరి?
పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే ఈ కాంగ్రెస్… pic.twitter.com/yvzvBk5eKI
— BRS Party (@BRSparty) March 31, 2026
Prabhas | ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ.. ప్రభాస్ స్పీడ్‌కు ఇండస్ట్రీ షాక్!
Harish Rao | కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో..? మాకు ప్రజా సమస్యలే ముఖ్యం : హరీష్ రావు
Leander Paes: బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్