తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi). చాలా కాలం సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్న ఈ లెజెండరీ సినీ తార 15 ఏండ్ల తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ (English Vinglish) సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా తన యాక్టింగ్‌తో అందరినీ ఫిదా చేసింది శ్రీదేవి.
అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ఈ చిత్రం త్వరలో తొలిసారి చైనాలో విడుదల కాబోతుంది. శ్రీదేవి 5వ వర్థంతి సందర్భంగా చైనాలో ఫిబ్రవరి 24న (చైనీస్ భాషలో) గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం చైనాలో 6వేల థియేటర్లలో ఇంగ్లీష్ వింగ్లీష్ విడుదల కాబోతుంది. ఈ చిత్రం చైనా మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు మేకర్స్.
గౌరీ షిండే కథనందిస్తూ.. దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ఆదిల్ హుస్సేన్, మెహిదీ నెబ్బొవ్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. హోప్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ చిత్రానికిఅమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇంగ్లీష్ వింగ్లీష్ 2012 అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.