బుల్లితెర, వెండితెర అయిన తనదైన స్టైల్లో దూసుకుపోతుండడం శ్రీముఖి స్పెషాలిటీ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంటుంది. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది.అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. ఆ మధ్య అవినాష్‌తో తెగ సందడి చేసిన శ్రీముఖి రీసెంట్గా నాగబాబుతో ఫన్ వీడియో చేసి ఎంటర్టైన్మెంట్ పంచింది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అనేక గేమ్స్ వస్తున్నాయి. మీకు పెళ్లి ఎప్పుడవుతుందో తెలుసుకోండి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి.. ఈ సెలబ్రిటీలలో మీ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే వారు ఎవరో తెలుసుకోండి అంటూ అనేక గేమ్స్ ఉన్నాయి. తాజాగా అలాంటి గేమ్ ఆడింది శ్రీముఖి. నవమన్మథుడా అతిసుందరుడా నను వలచిన ఆ ప్రియుడు అంటూ పాట పాడుకుంటూ శ్రీముఖి ఇన్‌స్టాగ్రామ్‌లో గేమ్ ఆడింది.
ఈ గేమ్ లో శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్లు చూపించింది. ఇది చూసిన నెటిజన్స్… అక్కా నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా అంటూ ఆమెని సరదాగా ఆటపట్టిస్తున్నారు. తొక్కేం కాదు అంటూ ఓ నెటిజన్ కి బదులు ఇచ్చింది.ఈ అమ్మడు చివరిగా మాస్ట్రో అనే సినిమాలో మెరిసింది. ఇక క్రేజీ అంకుల్ అనే చిత్రం కూడా చేయగా, అది నిరాశపరచింది. భోళా శంకర్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది శ్రీముఖి.