DJ Tillu-2 Heroin | ‘పెళ్ళి సందD’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ చిత్రంతో అటు మాస్ ప్రేక్షకులను ఇటు క్లాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్‌లో సగం వరకు క్రెడిట్ ఈమెకే దక్కుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల తన అందం, అభినయంతో చలాకీ అమ్మాయిగా ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా యూత్‌లో ఈ అమ్మడుకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. కాగా తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘డీజే టీల్లు ఒకటి’. మార్చ్12న విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను రాబట్టింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా ఈ సీక్వెల్లో సిద్దూకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మేకర్స్ హీరోయిన్గా పలువురు పేర్లు అనుకున్న చివరికి శ్రీలీలను ఎంపిక చేశారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సిఉంది. గతంలో మేకర్స్ హీరోయిన్గా అనుపమను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో శ్రీలీల ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతం శ్రీలీలకు టాలీవుడ్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. రవితేజతో కలిసి నటించిన ‘ధమాకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దీనితో పాటుగా నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్గా ఎంపికైంది.