ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటా!
అచ్చ తెలుగు అందం శ్రీలీల అనతికాలంలోనే టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. గత కొంతకాలంగా ఈ భామ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా..యూత్‌లో ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
అచ్చ తెలుగు అందం శ్రీలీల అనతికాలంలోనే టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. గత కొంతకాలంగా ఈ భామ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా..యూత్‌లో ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ సొగసరి తమిళ, హిందీ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నది. అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు ఆరంభించింది.
అగ్ర హీరో అజిత్ సరసన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం ద్వారా తమిళంలో అరంగేట్రం చేయబోతున్నదనే వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన శ్రీలీల మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. తమిళంలో తాను నయనతార నటనను బాగా ఇష్టపడతానని, ఆమె తరహాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలనుందని తెలిపింది. నటనకు సంబంధించిన చాలా అంశాల్లో తాను నయనతారను స్ఫూర్తిగా తీసుకుంటానని, ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని శ్రీలీల పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

