Actress Sreeleela | సినీరంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరు నటీమణుల విషయంలో మాత్రం ఒకటీ లేదా రెండు సినిమాలతో రావలిసిన దానికంటే ఎక్కువే గుర్తింపు వస్తుంది. ఈ విషయంలో శ్రీలీల నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది. ‘పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతేడాది దసరాకు రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రిలీజ్‌కు ముందు హైప్ తెచ్చిన పాటలు.. రిలీజ్ తర్వాత శ్రీలీల అందాల ఆరబోతకు యూత్ థియేటర్లకు పరుగులు పెట్టారు. ఈ సినిమా సక్సెస్‌లో శ్రీలీల మేజర్ పాత్ర పోషించింది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా తన గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకుంది.
ఇక ఇటీవలే రిలీజైన ‘ధమాకా’ సినిమా కూడా అంతే. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా లాటరీ హిట్టనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు. ఈ మూవీ స్టోరీ పాత కథలను మిక్సీలో వేసి రుబ్బినట్లు ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఒక్క ఆర్టిస్టుకు కూడా స్కోప్ లేదు. ముఖ్యంగా హీరోయిన్ శ్రీలీల పాత్రకు అంతగా స్కోప్ లేదు. దాంతో నటనకు పెద్దగా పని చెప్పే అవసరం రాలేదు. కానీ ఉన్నంతలో బాగానే చేసింది. ఇక ముఖ్యంగా శ్రీలీల తన డ్యాన్స్‌లతో అదరగొట్టింది. రవితేజ పర్ఫార్మెన్స్కు ఏ మాత్రం తగ్గకుండా డాన్స్‌తో రెచ్చిపోయింది. నిజానికి ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ ఈమెకే దక్కుతుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, బోయపాటి-రామ్ పోతినేని మూవీ, బాలయ్య 108లలో నటిస్తుంది. వీటితో పాటుగా గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కీరిటీ డెబ్యూ మూవీలోనూ ఆమెనే హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఇవన్నీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. దాంతో నెక్ట్స్ ఇయర్ కూడా శ్రీలీలదే బాక్సాఫీస్ దగ్గర హవా కొనసాగే చాన్స్ ఉంది.