Sreeleela- Kartik | టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు “పెళ్లి సందD” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత ‘ధమాకా’ సినిమాలో రవితేజతో కలిసి నటించగా, ఆ చిత్రం మంచి హిట్ కావడం ఈ అమ్మడికి బిగ్ బ్రేక్‌గా మారింది. అప్పటి నుంచి హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తాజాగా హిందీ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్న సినిమాతో పాటు.. వారి మధ్య పెరుగుతున్న సానిహిత్యంపై మళ్ళీ చర్చ మొదలైంది. షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య బాండింగ్ మొదలైందని టాక్. దీనిపై ఇద్దరూ స్పందించకపోయినా, వీరిద్దరూ తరచూ పార్టీల్లో, పబ్లిక్ ప్లేస్ల్లో కనిపిస్తుండటంతో రూమర్స్ కు మరింత బలం చేకూరుతోంది.
అంతేకాదు, ఇటీవల కార్తీక్ తల్లి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘‘మా ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి’’ అని చెప్పడం, ఇప్పటికే ఎంబీబీఎస్ చదువుతోన్న శ్రీలీలను ఉద్దేశించే చేసి ఉంటుందని ముంబయి బీటౌన్ లో చర్చ నడుస్తోంది.ఇదిలా ఉండగా, ఇటీవల ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ బయట శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ కలిసి కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. మరోసారి వీరి డేటింగ్ గాసిప్స్ తెరపైకి రావడానికి ఇది బలమైన కారణంగా చెబుతున్నారు. చూస్తుంటే ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.
ఇక శ్రీలీల కెరీర్‌పై ఓ లుక్కేస్తే… ఇటీవల ‘రాబిన్ హుడ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు రవితేజతో ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, కిరీటి రెడ్డితో ‘జూనియర్’ సినిమాల్లో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది. అయితే శ్రీలీల , కిరీటీ జంటగా వారాహి చలన చిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘ జూనియర్ ’ నుండి వైరల్ వయ్యారి అనే పాట విడుదల కాగా, ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో గాలి వారసుడు కిరీటీ తెరపైకి హీరోగా రాబోతోన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో మూవీకి సంగీతం అందిస్తున్నారు.