Sreeleela Remunaration | సినీరంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. కొందరు నటీమణులకు ఎన్ని సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటీ లేదా రెండు సినిమాలతో రావలిసిన దానికంటే ఎక్కువే గుర్తింపు వస్తుంది. ఈ విషయంలో శ్రీలీల నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది. ‘పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా విజయంలో ఈమె కీలకపాత్ర వహించిందని చెప్పవచ్చు. ఈ సినిమా విజయంతో శ్రీలీలకు వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. యువ హీరోలు కూడా ఈమె వైపు మొగ్గుచూపుతున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విధంగా క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు వెనకేసుకోవాలి అని శ్రీలీల తన పారితోషికాన్ని పెంచుతుందట. తాజాగా ఈమె నితిన్ 32వ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఆదివారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు శ్రీలీల 1.25 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సమాచారం. ప్రస్తుతం ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా అడిగినంత పారితోషికాన్ని ఇచ్చారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలి. ప్రస్తుతం ఈమె రవితేజతో ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వచ్చింది. దీనితో పాటుగా మంత్రి గాలిజనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటీ డెబ్యూ మూవీలో హీరోయిన్గా ఎంపికైంది.