Dhamaka movie poster | మాస్‌రాజా రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ఖిలాడి శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. రవితేజ నటన, పాటలు, సినిమా క్వాలీటి బాగున్న స్క్రీన్‌ప్లై బాగాలేదంటూ దీనికి కారణం దర్శకుడు రమేష్ వర్మనే అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అందులో త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా చిత్రం ఒకటి. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ధమాకా చిత్రం నుండి మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలోని శ్రీలీల పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదలచేశారు. శ్రీలీల ఒక చేతితో పొట్లం పట్టుకుని మరోక చేతితో ఏదో తింటూ.. రవితేజ చెప్పే కబుర్లను వింటున్నట్లు ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. శ్రీలీల ఈ చిత్రంలో ప్రణవి పాత్రలో నటించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి విశ్వనాథ్, అభిషేక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని.
#Dhamaka pic.twitter.com/CGpCsEeRJ8
— Ravi Teja (@RaviTeja_offl) February 14, 2022