Sreeleela | అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాలు చేసి మెప్పించింది. అయితే కొంత కాలంగా శ్రీలీలకి పెద్ద హిట్ అనేది లేదు. టాలీవుడ్లో అవకాశాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకుంటుంది. కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఒక సినిమా చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆయనతో కలిసి ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందనే ప్రచారం ఉంది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో అయితే శ్రీలీల అండ్ ఫ్యామిలీ.. కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి సందడి చేయడం కూడా అనేక అనుమానాలు కలిగించింది.
ఇక తాజాగా శ్రీలీలకి సంబంధించిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇందులో తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు నాకు బిగ్ డే అంటూనే పూర్తి వివరాలు కమింగ్ సూన్ అంటూ హిట్ ఇవ్వడంతో శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిందంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఇది వాణిజ్య ప్రకటనకి సంబంధించినది అయి ఉండొచ్చు, లేదంటే శ్రీలీల ఇంట జరిగిన ఏదైన వేడుకకి సంబంధించిన పిక్స్ అయి ఉండొచ్చు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల ఇంట ఏ వేడుక చేసిన చాలా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. వచ్చే నెలలో ఆమె పుట్టిన రోజు ఉండడంతో ఇలా సంప్రదాయబద్ధంగా జరిపి ఉంటారని ముచ్చటించుకుంటున్నారు.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఉన్నట్లుండి నిశ్చితార్థం చేసుకుంటుందా అని కొందరు ఆలోచనలో పడ్డారు. మరి దీనిపై ఈ ముద్దుగుమ్మ ఏమైన క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్‌తో ఒక సినిమా, తెలుగులో రవితేజ సరసన మరో చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కూడా రెండు సినిమాలకు సంతకం చేసిందని వార్తలు వస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.