Sreeleela | ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగులో శ్రీలీలకి మంచి అవకాశాలు వచ్చిన వాటిని ఎందుకో వినియోగించుకోలేకపోయింది. తాను చేసిన ప్రాజెక్ట్‌లు ఒక్కొక్కటిగా గాడి తప్పాయి. ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్ చిత్రం కూడా శ్రీలీలకి కలిసి రాలేదు. బాలీవుడ్ ఎంట్రీతో ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ చిత్రం చేస్తుండగా, ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం కోసం ఇప్పటికే కొన్ని ఫైర్ లవ్ గ్లింప్స్‌ను విడుదల చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది.ఈ క్రమంతో తాజాగా ఫాలోవర్స్ అడిగిన ఓ పది ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పింది. ‘ఎలా ఉన్నావ్?’ అని ఓ అభిమాని అడిగితే.. ఇలా ఉన్నాను అంటూ ఓ ఫోటోని పోస్ట్ చేసింది శ్రీలీల. ‘మీ ఆరోగ్యం జాగ్రత్త’ అని మరో ఫ్యాన్ అంటే.. ”నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తనే చూసుకుంటుంది” అంటూ తన తల్లితో దిగిన పిక్ ని షేర్ చేసింది. మరో నెటిజన్.. నాకు పరీక్షలు ఉన్నాయి. ఏమైనా టిప్స్ చెబుతావా అని అడగ్గా.. సోషల్ మీడియాకు దూరంగా ఉండు. ఎక్కువసార్లు రివిజన్ చేసుకో., ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకో. అలసిపోతే వీడియోలు చూడు, చాట్ జీపీటీ సాయం తీసుకో అని చెప్పుకొచ్చింది.
అవి టిప్స్ కాదు, నాకు బాగా ఉపయోగపడ్డాయని శ్రీలీల పేర్కొంది. ఇదే క్రమంలో మరో నెటిజన్… ‘నీ ఫేస్ అచ్చం నా వైఫ్ మాదిరిగా ఉంది’ అని కామెంట్ చేయగా.. ”ఐడియల్ సిచ్యుయేషన్స్ లో నన్ను భార్యగా చేసుకోండి అని నేనంటాను.. అయ్యో, నేను సరదాగా అన్నాను. మీ భార్యకు నా ప్రేమను తెలియజేయండి అని రిప్లై ఇచ్చింది. ఇక స్కిన్ కేర్ టిప్స్ చెప్పమని అడిగితే.. మొటిమలు రావడం ఈ రోజుల్లో సహజం. కాబట్టి మై లవ్లీ యంగ్ లేడీస్ మీరు వాటి గురించి ఏ మాత్రం దిగులు పడొద్దని పేర్కొంది.