Sreeleela | ‘ఇందులో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్. ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిని. నాకు నేను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటా. ఈ ప్రపంచమంతా నా చుట్టూనే ఉంటుందని ఫీలవుతుంటా. క్యూట్‌గా బబ్లీగా నా పాత్రను దర్శకుడు వెంకీ కుడుముల డిజైన్ చేశారు. మీకు తప్పకుండా నచ్చుతుంది.’ అని నటి శ్రీలీల అన్నారు. నితిన్‌కి జోడీగా ఆమె నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం శ్రీలీల విలేకరులతో ముచ్చటించారు. ‘వరుస రిలీజుల తర్వాత నా ఎడ్యుకేషన్ కోసం కాస్త గ్యాప్ తీసుకోవాలనుకున్నా. అలాంటి సమయంలో డైరెక్టర్ వెంకీ కాల్ చేసి, ఈ కేరక్టర్ వినిపించారు. రష్మికకు చాలా నచ్చిన పాత్ర ఇది. డేట్స్ కుదరక తను వదులుకున్నారు. దాన్ని నేను ఓకే చేశానని తెలిశాక, ‘పుష్ప-2’ లొకేషన్లో కలిసి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు రష్మిక’ అని శ్రీలీల గర్తుచేసుకున్నారు.
నితిన్‌తో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఉంటుందని, సినిమా విషయంలో టీమంతా కాన్ఫిడెన్స్‌తో ఉన్నామని, చక్కని క్వాలిటీతో రిచ్‌గా సినిమా ఉంటుందని శ్రీలీల తెలిపారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల ట్రాక్‌ని షూట్ చేస్తున్నప్పుడే పడిపడి నవ్వానని, వీరి సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయని శ్రీలీల చెప్పారు.